Anakapalli : ‘అనకాపల్లి’ క్రేజీ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల’ వచ్చింది విన్నారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ‘రా అండ్ రస్టిక్’ సినిమాలకు ఎప్పుడూ యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా నైపథ్యంతో, కళ్లు చెదిరే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం నుండి తాజాగా సంచలన నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్) చేతుల మీదుగా ‘ఎలగే పిల్ల’ అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
సాంగ్ లాంచ్ చేసిన అనంతరం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చిత్రయూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ పాట చాలా క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ మరియు హీరో వేసిన సింపుల్ స్టెప్పులు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతున్న ఈ రస్టిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ సాంగ్స్ యూట్యూబ్‌లో ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు వచ్చిన ‘ఎలగే పిల్ల’ సాంగ్ కూడా ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ అందించిన అద్భుతమైన సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోయగా.. కపిల్ కపిలాన్, దేవ్ జండ్ ల గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హీరో విక్రమ్ సహిదేవ్ ఈ రొమాంటిక్ ట్రాక్‌లో తన గ్రేస్ మరియు సింపుల్ హుక్ స్టెప్స్‌తో అదరగొట్టాడు. ఈ స్టెప్స్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
Also Read
- Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో 'ఇరుముడి' ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!