Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Producer Ke Gnanavel Raja Interview For Thangalaan

ఆస్కార్ కి తంగలాన్.. విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్: నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇంటర్వ్యూ

Published Date :August 16, 2024 , 10:21 pm
By Bhargav Chaganti
ఆస్కార్ కి తంగలాన్.. విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్: నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Producer KE Gnanavel Raja Interview for Thangalaan: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” సినిమాకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఒక మంచి సినిమాను ప్రేక్షకుల తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని “తంగలాన్” నిలబెట్టిందని ఆయన అన్నారు. తాజా ఇంటర్వ్యూలో “తంగలాన్” సినిమా సక్సెస్ గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు.

Puri Jagannadh: పూరి… ఏంటి ఇంత పని చేశావ్? కెరీర్లోనే ఇది దారుణం!!

Also Read

  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
  • Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

– “తంగలాన్” సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దాని కంటే రెట్టింపు కలెక్షన్లు వస్తున్నాయి. కలెక్షన్స్ తో మేము ఆశ్చర్యపోతున్నాం. ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటా మంచి వసూళ్లు వస్తున్నాయి. చియాన్ విక్రమ్ గారి కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్. 200 కోట్ల రూపాయల వరకు రాబడుతుందని ఆశిస్తున్నాం. అందుకే టీమ్ థియేట్రికల్ విజిట్ కి వెళ్తున్నారు. ఆడియన్స్ కు తంగలాన్ ను మరింత చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నాం. విక్రమ్ గారు కూడా తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ కూడా వెళ్లారు. తమిళంలో తంగలాన్ తో పాటు డిమాంటీ కాలనీ 2 కూడా రిలీజైంది. తంగలాన్ కు బిగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిమాంటీ కాలనీ 2 కూడా బాగానే ఆడుతోంది.

– తెలుగులో మాతో పాటు 15న రిలీజైన అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నా. తంగలాన్ కు థియేటర్స్ పెరుగుతున్నాయి. అన్ని ఏరియాల్లో స్క్రీన్స్ యాడ్ చేస్తున్నారు. హిందీలో మూడు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అందుకే అక్కడ రిలీజ్ 30వ తేదీన చేస్తున్నాం. మిగతా అన్ని భాషల్లోనూ 30న తంగలాన్ రిలీజ్ కు రాబోతోంది.

– మా సంస్థ నుంచి బడ్డీ, తంగలాన్ రెండూ భిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిర్మాతగా నేనెప్పుడూ దర్శకుడిని నమ్ముతాను. ఆ తర్వాత స్క్రిప్ట్. పా రంజిత్ గారు ఎంత బాగా మూవీ చేయగలరో నాకు తెలుసు. నాకు చియాన్ విక్రమ్ గారితో మూవీ చేయాలనే డ్రీమ్ ఉండేది. విక్రమ్ గారు తంగలాన్ చేసేందుకు ముందుకు రావడం ఇంకా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత విక్రమ్ గారి ఇంటికి బొకే పంపా, ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కనుక్కున్నారు.

– మా స్టూడియో గ్రీన్ సంస్థలో చేసిన మొదటి సినిమా పరుత్తివీరన్ పీరియాడిక్ మూవీ. ఇలాంటి ప్రయత్నాలు మేము గతంలో చేశాం. అయితే తంగలాన్ లాంటి మూవీ చేయాలంటే కనీసం పదీ పదిహేనేళ్ల టైమ్ పడుతుంది. తంగలాన్ స్క్రిప్ట్ విషయంలో పా రంజిత్ గారు తప్ప మిగతా ఎవరూ ఇన్వాల్వ్ కాలేదు. చియాన్ విక్రమ్ గారు తన యాక్టింగ్ మీద మాత్రమే ఫోకస్ చేశారు.

– తంగలాన్ వరకు నాకు సెట్ ఎక్స్ పీరియన్స్ చాలా తక్కువ. మొత్తం 108 రోజుల షూటింగ్ జరిగితే నేను కేవలం 4 రోజులు వెళ్లాను. 2 గంటల చొప్పున సెట్ లో గడిపాను. పా రంజిత్ గారి మీద నమ్మకంతో ఆయన, ఆయన టీమ్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం.

– మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని మనమంతా నమ్ముతాం. కొందరు దేవుని విశ్వసిస్తారు. మరికొందరు కర్మను నమ్ముతారు. మనం తప్పు చేస్తే ఏదో చెడు జరుగుతుందనే ఫీల్ కలుగుతుంటుంది. నేచర్ కూడా అలాగే తప్పు చేస్తే నేచర్ కూడా శిక్షిస్తుంది. మాళవిక మోహనన్ ఆరతి క్యారెక్టర్ ఆ భావనతో క్రియేట్ చేశారు దర్శకుడు పా.రంజిత్. సినిమాల మేకింగ్ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే.

– కంగువ, తంగలాన్ సినిమాలను బడ్జెట్ పరంగా ఖచ్చితంగా ప్లాన్ చేయలేం. ఇవి రెండూ డిఫరెంట్ మూవీస్. వీటిని ఇలా స్టార్ట్ చేసి ఆ టైమ్ కు ముగించుదాం అని కన్ఫర్మ్ గా చెప్పలేం. మిగతా సినిమాలకు కాస్త బడ్జెట్ అటూ ఇటూగా అంచనా వేయొచ్చు. కానీ కంగువ, తంగలాన్ కు అలా చేయలేం. సినిమాకు కావాల్సింది ఇవ్వాల్సిందే.

– తంగలాన్ లో చియాన్ విక్రమ్ గారితో పాటు పార్వతీ, మాళవిక, పశుపతి..ఇంకా ప్రతి ఒక్కరి పాత్రల నటనకు ప్రశంసలు వస్తున్నాయి. వారు ఆ పాత్రలుగా మారిపోయారు. బయట చూస్తే మీరు వారిని గుర్తుపట్టలేరు. అంత సహజంగా పర్ ఫార్మ్ చేశారు. షూటింగ్ టైమ్ లో చాలా మందికి గాయాలు అయ్యాయి. వారికి టైమ్ ఇచ్చి మళ్లీ షెడ్యూల్ చేసుకుంటూ వచ్చాం.

– కంగువ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మరో కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ ముందు విడుదల చేస్తాం. ఆ ట్రైలర్ కంప్లీట్ గా ఫ్రెష్ కట్ తో ఉంటుంది. ఇవాళ మోర్ రూటెడ్ మూవీస్ ఆదరణ పొందుతున్నాయి. కాంతార కన్నడ వారికి కూడా పెద్దగా పరిచయం లేని కథే. అలాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందింది. తెలుగులో రంగస్థలం లాంటి సినిమాను అంతకముందు ఊహించలేం. హీరోకు ఫిజికల్ ప్రాబ్లమ్ ఉందంటే మన వాళ్లు గతంలో ఊహించలేకపోయేవారు. పుష్ప కూడా అంతే. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ ట్రెండ్ అయ్యింది. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాం. తెలుగులో స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ కుదిరితే అలాంటి మూవీ నిర్మిస్తాం.

– ఏదైనా నిజం మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంటుంది. నేను మనసులో ఉన్నది చెబుతుంటా. నేషనల్ అవార్డ్స్ లో పొన్నియన్ సెల్వన్ కు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. అలాగే మిగతా విన్నర్స్ కు కూడా కంగ్రాట్స్ చెబుతున్నాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • KE Gnanavel Raja
  • KE Gnanavel Raja Interview

తాజావార్తలు

  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..

  • MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions