NTV Telugu Site icon

Hari Hara Veera Mallu : పవన్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Harihara Veeramallu

Harihara Veeramallu

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రం షూటింగ్ నాలుగేళ్ళ క్రిందటే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదట్లో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఆ తరువాత పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఈ సినిమా ప్రారంభించిన తరువాత కూడా పవన్ పలు సినిమాలు చేయడంతో ఇక ఈ మూవీ ఆగిపోయిందనే రూమర్లు వచ్చాయి.కానీ రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోలేదని మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Read Also :Kalki 2898 AD : కల్కి సినిమా చూసాక ప్రేక్షకులకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది : నాగ్ అశ్విన్

ఈ సినిమా మొఘలుల కాలం నాటి పీరియాడిక్  యాక్షన్ మూవీగా రూపొందుతుంది.అయితే ఈ సినిమా నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు.ఈ సినిమా మిగిలిన భాగాన్నిఏఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు .ఈ సినిమాలో మొఘలులు ,నవాబులపై పోరాడే బందిపోటుగా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమాను సెప్టెంబర్ ,అక్టోబర్ మధ్యలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ టైం లో ఈ సినిమా రావడం సాధ్యమేనా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Show comments