సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా భావిస్తుంటారు. బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తన దేవుడు పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ బండ్లగణేష్ దారుణమైన ట్రోలింగ్‌కి గురవుతుంటారు. ఈ విధంగా తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇకపై నా జీవితంలో విమర్శలకు, వివాదాలకు చోటు ఉండకూడదని ట్విట్టర్‌కి గుడ్ బై చెబుతున్నాను అంటూ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా బండ్ల గణేష్ ట్విట్టర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు తెలియజేయడంతో అభిమానులు కొంతమేర ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ వర్షాల సీజన్లో మబ్బులు వస్తాయి.. సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి విమర్శలు మామూలే అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితులు తనని సోషల్ మీడియా నుంచి తప్పుకోవాల్సిన అవసరంలేదని చెప్పడంతో బండ్ల గణేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… తాను ట్విటర్ నుంచి తప్పుకుంటున్నాను అనే నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ఆ నిర్ణయంతో ఏకీభవించలేదు.. అలాంటి వారిలో జర్నలిస్ట్ సతీష్ బాబు ఒకరని, ఆయన సూచన మేరకు, అతనికి గౌరవం ఇస్తూ తిరిగి ట్విట్టర్‌లో కొనసాగుతున్నానని బండ్ల గణేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా త్వరలోనే తాను దైవంగా భావించే పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా తీసి మరో సారి బ్లాక్ బస్టర్ విజయాన్నిఅందివ్వడానికి సిద్ధమయ్యానని, ఈ విషయం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
