Site icon NTV Telugu

SSMB 29 : రోజుకో ఆట చూపిస్తున్న జక్కన్న..!

Ssmb 29 Priyanka Chopra

Ssmb 29 Priyanka Chopra

రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకం. ఆయన దర్శకత్వంలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. కథ, పాత్రలు, సాంకేతికత మాత్రమే కాదు.. ప్రతి షాట్‌ కూడా ఒక అద్భుత ప్రయోగం లా ఉంటుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్‌బాబుతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘SSMB29’ మరింత గట్టిగా ప్లాన్ చేస్తూన్నారు.

Also Read : Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్.. !

కాగా ఈ సినిమా ఒక ట్రెజర్ హంట్ అడ్వెంచర్‌గా రూపొందుతున్నట్లు ఇప్పటికే తెలిసినప్పటికి. తాజాగా.. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ ఛౌ అనే ప్రాచీన నృత్యరూపం ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందన్న వార్తలు వైరల్‌గా మారాయి. అందుకే రాజమౌళి, కథ నడిచే నేపథ్యాన్ని నిజాయితీగా చూపించాలనే ఉద్దేశంతో ఓ స్పెషల్ సీక్వెన్స్‌ కోసం ఒడిశా హిల్స్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ఒడిశా నేపథ్యం ఈ కథలో కీలకమట. అందుకే.. సమాచారం ప్రకారం ఈ ‘మయూర్‌ భంజ్‌ ఛౌ’ అనే నృత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా ప్రియాంక చోప్రాకి ఆర్డర్‌ పాస్‌ చేశారట రాజమౌళి. దీంతో ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తయ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా ఈ నృత్యాన్ని అభ్యసించారు. మూడు విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయాన్ని స్వయంగా..

ప్రియాంకకు నృత్యం నేర్పిన భర్తయా తెలిపారు.. ‘ప్రియాంకకు నృత్యం నేర్పడం గొప్ప అనుభవం. నృత్యాన్ని నేర్చుకోవడంలో ఆమె చూపించిన ఆసక్తి నిజంగా స్పూర్తిదాయకం. పెద్ద హీరోయిన్‌ని అన్న భావన తనలో ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో నేను భాగం అయినందుకు సంతోషిస్తున్నాను’ అని తెలిపారు. ఇక ముందు నుండి ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్‌ హంట్‌ మూవీ ఇదని ఇప్పటి వరకూ వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఒడిశా నేపథ్యం అంటున్నారు. మరి వీటిలో ఏది నిజం.

Exit mobile version