Site icon NTV Telugu

వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్

Priyanka Chopra Jonas clicked watching the Women’s Final at Wimbledon

వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యింది. శనివారం అశ్లిగ్ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో మన గ్లోబల్ బ్యూటీ కన్పించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిక్స్ లో హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ తో ప్రియాంక చోప్రా తన వెంట ఓ ట్యాన్ బ్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే ప్రిన్స్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా ఈ మ్యాచ్ చూడడం విశేషం. ఆమె డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్, ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. కాగా ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ప్రియాంక స్నేహితురాలు. ఇక గేమ్ ను చూడడానికి హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, డేమ్ మాగీ స్మిత్ కూడా విచ్చేశారు.

Read Also : ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్న “విక్రమ్” ఫస్ట్ లుక్

ప్రస్తుతం ప్రియాంక చోప్రా పలు హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. వాటిలో ‘సిటాడెల్’ థ్రిల్లర్ సిరీస్, ‘టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ సహా అనేక ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత నెలాఖరున ప్రియాంక తన కుటుంబ సభ్యులతో గడపడానికి న్యూజెర్సీకి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఫ్యామిలీతో సంతోషంగా సమయం గడుపుతున్న పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ప్రియాంక అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేసింది.

Exit mobile version