NTV Telugu Site icon

Priya darshi: హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!

Untitled Design (1)

Untitled Design (1)

హాస్యనటుడుగా పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రియదర్శి . కమెడియన్ రోల్స్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న పలు వెబ్ సిరీస్ లు నటిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి.

గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశం సినిమాలో తన నటనతో అందరి ప్రశంసలు పొందాడు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన బలగం చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందడమే కాకుండా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో నిర్మాతలు దర్శితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో  “డార్లింగ్” అనే సినిమా చేసాడు ఈ హీరో. దర్శికి జోడిగా అందాల నటి నభా నటేశ్‌ నటిస్తోంది. ఈ చిత్రం ప్రీ – రిలీజ్ ఈవెంట్ గత రాత్రి పార్క్ హయత్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

డార్లింగ్ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ ” ఈ డెకేడ్ లోనే నాకు నచ్చిన చిత్రం బలగం. బలగం చిత్ర ఫ్యాన్ గా, బలగం హీరో ఫ్యాన్ గా వచ్చాను, ఈ శుభసందర్భంలో నా ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమాలో నేను  నిర్మించబోయే సినిమాలో ప్రియదర్శి హీరోగా చేయబోతున్నాడు. జగదీశ్ అనే కుర్రాడిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను” అని నాని అనౌన్సు చేసాడు. ఇలా వరుసగా పేరున్న బ్యానర్ లో సినెమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్ ను ఏర్పరుచుకుంటున్నాడు ప్రియదర్శి. ఈ హీరో నటించిన డార్లింగ్ ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది

Also Read : Ram pothineni : డబుల్ ఇస్మార్ట్ కు..డబుల్ ఆఫర్..!