NTV Telugu Site icon

Priya Bhavani Shankar : ఆ సినిమా హిట్ తో ప్రశాంతంగా నిద్రపోయాను..

Jiva

Jiva

ప్రియా భవాని శంకర్ న్యూస్‌రీడర్‌, సినిమా నటి. మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.తొలినాళ్లలో చేసిన సినిమాలు ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కార్తీ నటించిన చినబాబు చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో లీడ్ రోల్ లో కొన్ని సినిమాల్లో మెరిసింది ప్రియా భవాని శంకర్. హరి దర్శకత్వంలో వచ్చిన యానై, ధనుష్ నటించిన తిరుచిత్రంబలం తెలుగులో తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ చిత్రం తర్వాత వరుస ప్లాప్ సినిమాలు పలకరించాయి. కళ్యాణం కమనీయం ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టిన అమ్మడు నిరాశే ఎదురైంది. కాగా ఈ తమిళ భామ నటించిన చివరి ఐదు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వేటికవే ప్లాప్ గా నిలిచాయి. దీంతో ఈ హీరోయిన్ పై ప్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ -2 ప్రియా భవాని కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ ” ప్లాప్స్ వచ్చినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ఎవరు ఏంటిఅనేది అప్పుడు తెలుసుకున్నాను. డిమాంటీ కాలనీ -2 సూపర్ హిట్ తనకు ఎంతో స్పెషల్, ఆ సినిమా హిట్ కావడంతో తాను ప్రశాంతంగా నిద్రపోయానని” తెలిపింది. జీవాకు జోడిగా నటించిన బ్లాక్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

Show comments