Site icon NTV Telugu

ప్రభాస్ ‘సాలార్‌’లో పృథ్వీరాజ్

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న’సాలార్’ సినిమాలో మరో సౌత్ ఇండియన్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలలో పరభాషా తారలను నటింపచేయటం ఆసక్తికరంగా మారింది. అలా యష్ నటిస్తున్న ‘కెజిఎఫ్2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించడంతో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నెగటివ్ రోల్ పోషిస్తుండటం ఆ సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కెజిఎఫ్2’ మలయాళ హక్కులను పృథ్వీరాజ్ సొంత చేసుకుని ఉన్నాడు. ఇక ‘సాలార్‌’లో శృతి హాసన్ హీరోయిన్‌. హోంబలే ఫిల్మ్స్ ‘సాలార్’ ను నిర్మిస్తోంది. ఈ సినిమా 2022లోనే విడుదల కానుంది.

Exit mobile version