NTV Telugu Site icon

Prithviraj Sukumaran: ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్

February 7 (23)

February 7 (23)

బాష తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో ప్రభాస్. హీరోగా కంటే తన మంచితనం తో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ప్రజంట్ కెరీర్ పరంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్​కు బయటనే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. కానీ తను మాత్రం కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే అప్‌డేట్లు మత్రమే ఇస్తూంటాడు. తన వ్యాక్తిగత విషయాలు రేర్‌గా పంచుకుంటుంటారు. అయితే తాజాగా ప్రభాస్‌ ఇన్‌స్టా అకౌంట్ గురించి ఓ సీక్రెట్‌ను మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ రివీల్ చేశారు.. ఇంతకి ఏంటా విషయం అంటే..

Also Read: Allu Aravind : దేవి శ్రీ ప్రసాద్‌ని వద్దు అనడానికి కారణం ఇదే : అల్లు అరవింద్

ప్రజంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్2’ మూవీలో బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ను రూపొందించారు. ఈ మూవీ మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్ ప్రభాస్ సీక్రెట్ ఒకటి రివీల్ చేశాడు..

పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. ‘ ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ ఉంటాడు. స్టార్డమ్ గురించి అసలు ఆలోచించరు. సోషల్ మీడియాపై ఆసక్తి ఉండదు. ఇక ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్ స్టా నుంచి వచ్చే పోస్ట్‌లు కూడా షేర్ చేసేది ఆయన కాదు. ఈ మాట చెప్పి మీమల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి. అతనికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం. ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉంటాడు. ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని అడుగుతుంటారు. ప్రభాస్‌ని చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతాను’అని తెలిపాడు. అలాగే రాజమౌళి గురించి కూడా మాట్లాడుతూ..‘ ‘బాహుబలి’ సినిమాకు ముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినప్పటికీ ‘బాహుబలి 2’ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక అలాగే త్వరలో ‘సలార్2’ కూడా రానుంది రెడీగా ఉండండి’ అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు పృథ్వీ రాజ్. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.