తేజ దర్శకత్వంలో వచ్చిన వచ్చిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు ప్రిన్స్. ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ చిత్రం ద్వారా తోలి హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత సరైన సక్సెస్ లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్రిన్స్. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వెర్ లో ప్రిన్స్ కు మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు హీరోగా వచ్చిన అవకాశలు అందిపుచ్చుకుంటూ ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లోను అలరించాడు ప్రిన్స్.
Also Read : Subrahmanyaa Glimpse : దర్శకుడిగా సాయి కుమార్ తమ్ముడు.. సుబ్రహ్మణ్య గ్లింప్స్ రిలీజ్
ఇటీవల ఓ సినిమాలో హీరోగా నటించాడు ప్రిన్స్ అదే ‘కలి’. నరేష్ అగస్త్య తో నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు కథా రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు జీవన్ బాబు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ప్రిన్స్.