టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.సుకృతి వేణి ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ తెరకెక్కింది. ఇందులో సుకృతి వేణి అద్భుతంగా నటించి మెప్పించారు .ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా “దాదా సాహెబ్ ఫాల్కె” అవార్డు లభించింది. మంగళవారం ఢీల్లిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం సుకృతి వేణి బండ్రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్ 8 అభ్యసిస్తుంది.అయితే ఆమె నటించిన ఈ గాందీ తాత చెట్టు మూవీ గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సుకృతి వేణి తన మొదటి చిత్రంతోనే అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలతో పాటు పలు అవార్డ్స్ గెలుచుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డికి అవార్డులు లభించాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా ,అలాగే ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది.అలాగే జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు మూవీ అవార్డులు అందుకుంది.