నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ రాష్ట్రాలలో బుకింగ్స్ ఓపెన్ చేశారు.
కానీ ఈ సినిమాకు సంబందించి నైజాం ప్రాంతం బుకింగ్స్ విషయంలో మాత్రం తర్జన భర్జనలు జరిగుతున్నాయి. వాస్తవానికీ నిన్న సాయంత్రం 6 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఓపెన్ చేయలేదు. ఈ విషయమై ఆరా తీయగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కానీ అనుమతుల విషయంలో కాస్త జాప్యం జరుగుతోందని సమాచారం. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు కూడా ఇలాగే అనుమతులు ఇచ్చారు. కానీ తర్వాత కొందరు కోర్టులో కేసులు వేయడంతో నిర్మాతలకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడు రాబోతున్న అఖండ 2కు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జీవో ఇచ్చేలా కార్యచరణ చేస్తున్నారు. కానీ ప్రీమియర్స్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం అఖండ 2 మొదటి రోజు వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
