Site icon NTV Telugu

Shyam Mohan: వరుసగా మూడు హిట్లు..కొత్త కారు కొనేసిన ప్రేమలు విలన్

Shyam Mohan Car

Shyam Mohan Car

ప్రేమలు, అమరన్ చిత్రాల్లో నటించిన నటుడు శ్యామ్ మోహన్ కొత్త ఫోక్స్ వ్యాగన్ టైగన్ కారును కొనుగోలు చేశారు. నటుడు శ్యామ్ మోహన్ ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అతనికి తమిళంలో కూడా అమరన్ అవకాశం తీసుకొచ్చింది. మలయాళ చిత్రం ప్రేమలు రూ.136 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. క్రిస్ AD దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ కథతో రూపొందించబడింది. నస్లాన్, మమితా బైజు ప్రధాన పాత్రలలో నటించగా ఆది అనే నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మాలయంలోనే నునాకుజి అనే చిత్రంలో నటించాడు. ప్రేమలు ఇచ్చిన హిట్ వలన అమరన్ సినిమాలో నటించాడు.

Mystery Solved : వీడిన మడకశిర గుర్తు తెలియని శవం మిస్టరీ..!

ఇది అక్టోబర్ 31 న దీపావళి సందర్భంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో శ్యామ్ సాయి పల్లవికి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో తనకు ఇచ్చిన చిన్న పాత్రను సీరియస్‌గా తీసుకుని తన నటనా కౌశలం చూపించాడు. మొదట్లో సాయి పల్లవి ప్రేమను తిరస్కరించి, తర్వాత ఒప్పుకుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. విడుదలైన 13 రోజుల్లో అమరన్ రూ.255.25 కోట్లు వసూలు చేసింది. శివకార్తికేయన్ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూలు చేయడం ఇదే తొలిసారి. శివకార్తికేయన్ అమరన్ హిట్ తర్వాత శ్యామ్ మోహన్ కొత్త వోక్స్ వ్యాగన్ కారును కొనుగోలు చేశారు. తన భార్యతో కలిసి ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేసిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు.

Exit mobile version