అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తల’. ఇందులో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళంలో ‘వెట్టు’ పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మద్దతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. ఎందుకంటే విజయ్ హీరోగా యాక్ట్ చేసిన కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో కొన్ని పాటలకు అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే రీసెంట్‌గా విజయ్ సేతుపతి చేతుల మీదుగానే ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు.
Also Read:Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాగ్ మయూర్
ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. బిగ్ బాస్ ఫేమ్ ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశాడు. విశేషం ఏంటంటే.. ఈ పాటను తమిళ్ లో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ టి రాజేందర్ పాడారు. ఇలాంటి హుషారైన గీతాలకు టి. రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళ్ లోనూ ఊపేస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో యూత్ కు బాగా నచ్చేలా సాహిత్యం ఉంది. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.