Site icon NTV Telugu

Prakash raj: పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్

Pawan Kalyan Prakash Raj

Pawan Kalyan Prakash Raj

Prakash Raj Releases a Video on Pawan Kalyan Comments: తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ విషయం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమ మీద ఫైర్ అవడమే కాకుండా నటుడు ప్రకాష్ రాజు మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పూర్తి అవగాహనతో మాట్లాడాలని సున్నిత అంశాల మీద అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇక ఈ అంశం మీద ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి ఒక వీడియో మెసేజ్ కూడా అటాచ్ చేశారు.

Devara : దేవర బుకింగ్ ఎర్లీ ట్రెండ్స్.. రికార్డ్స్ బద్దలు

పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను, నేను చెప్పింది ఏంటి మీరు అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తేదీ తర్వాత నేను వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ప్రకాష్ చెప్పుకొచ్చారు. నిజానికి ముందుగా తిరుమల లడ్డు వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ సమస్య జరిగింది వెంటనే అసలు ఏం జరిగిందో వివరాలు కనుక్కుని నేరస్తులను శిక్షించండి. అంతేకానీ మీరు ఏదేదో నేషనల్ మీడియా ముందుకు తీసుకు రావద్దు. మన దేశంలో చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూనే సెంటర్లో అంటే కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు థాంక్స్ అంటూ ఆయన బిజెపిని ప్రస్తావిస్తూ ట్రీట్ చేశారు. ఆ ట్వీట్ ఉద్దేశిస్తూ తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు.

Exit mobile version