NTV Telugu Site icon

Prakash Raj: పవన్ కి ప్రకాష్ రాజ్ మరో కౌంటర్.. ఆ ఆనందమేంటో?

Pawan Kalyan Prakash Raj

Pawan Kalyan Prakash Raj

Prakash Raj Again Targets Pawan Kalyan on Tirumala laddu Issue: తిరుమల లడ్డు వివాదం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ ఫైర్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ తాను చేసిన ట్వీట్ ఏంటో సరిగా చూసుకోవాలంటూ మరొక వీడియో రిలీజ్ చేశారు. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా జరిగిన సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ తాను లడ్డు గురించి ఇప్పుడు ఏమి స్పందించనని ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ అని కామెంట్ చేశారు.

Jani Master: జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ వద్దు.. కస్టడీ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు

దాని మీద ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళు ఇలా సీరియస్ ఇష్యూ మీద సిల్లీ కామెంట్స్ చేయకూడదని పూర్తి అవగాహన ఉంటే తప్ప మాట్లాడకూడదని సీరియస్ అయ్యారు. వెంటనే తప్పు తెలుసుకున్న కార్తీ తాను పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించాలి అంటూ ట్వీట్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అది తప్పు అని చెప్పటం నా ఉద్దేశం కాదు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా వాళ్ళే లైట్ తీసుకోవడం బాలేదు అన్నట్లుగా పవన్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరును ప్రకాష్ రాజ్ ప్రస్తావించలేదు కానీ ఆయన పరోక్షంగా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తున్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులైతే ప్రకాష్ రాజు మీద విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments