Site icon NTV Telugu

Prakash Raj : రాజకీయనాయకుడి పాత్రను అయిష్టంగానే చేశా

Prakash Raj

Prakash Raj

Prakash Raj About His Character Sarileru Neekevvaru Movie

ప్రకాశ్‌ రాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర ఇచ్చిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర జీవిస్తుంటారు. ముసలి సీఎం పాత్రై.. యంగ్‌ విలన్‌ పాత్రైన.. మతిస్థిమితం లేని వ్యక్తి పాత్రైన ఏదైనా సరే.. అవలీలగా నటించేస్తుంటారు ప్రకాశ్‌రాజ్‌. అందుకే ఆయనకు విలక్షణ నటుడిగా గుర్తింపు వచ్చింది. ఆయన టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ తనదైన ముద్రవేశారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రలలో ఒకటి ‘సరిలేరును నీకెవ్వరు’ సినిమాలో చేశాను.

ఆ సినిమాలో అబద్ధాలాడే ఒక రాజకీయనాయకుడి పాత్రను అయిష్టంగానే చేశాను. కొన్ని సార్లు మన నిర్ణయాలతో .. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటుంది. మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో నేను అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన ‘మేజర్’ సినిమాలోని పాత్ర నాకు సంతృప్తినిచ్చింది. నా కెరియర్లో ‘ఆకాశమంత’ .. ‘బొమ్మరిల్లు’ సినిమాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి” అని తెలిపారు.

 

Exit mobile version