NTV Telugu Site icon

Pradeep : పవన్ కళ్యాణ్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా

Pradeep

Pradeep

తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఈ మధ్య బుల్లి తెరపై కనిపించడం మానేసాడు. టెలివిజన్ రంగంలో  ప్రదీప్ తిరుగులేని ఇమేజ్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుక్కారణం కారణం హీరో గా  నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే  పలు రకాల కథలు వినే పనిలో ఉన్నాడు.

యాంకర్ ప్రదీప్ గతం లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తో ప్రేక్షకులని పలకరించాడు. అయితే ఆ సినిమా హీరో గా ప్రదీప్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. అందుకే కొద్ది గా గ్యాప్ తీసుకొని హీరో గా రెండో సినిమా ను చేసేందుకు ప్రదీప్ సిద్ధం అవుతున్నాడు.. ఈ గ్యాప్ లో ఆయన ఎన్నో కథ లను విన్నారు. అందులో భాగంగా ఎట్టకేలకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ తో తన రెండవ సినిమాకు ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాడు ప్రదీప్. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా టివీ షోలకు దూరంగా ఉన్నారు, జబర్దస్త్ తో పాటు పలు కామెడీ షోలను డైరెక్ట్ చేసిన నితిన్, భరత్ లు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. సినిమా టైటిల్ ను వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు ,మేకర్స్. ప్రదీప్ సరసన పలు కెమెడీ షోస్ లో యాంకర్, డాన్సర్ గా చేసిన దీపికా పిళ్లై ను హీరోయిన్ గా నటిస్తోంది.