Kamal Sridevi: తొంభైల కాలంలో థియేటర్లలో తమ డ్యాన్స్‌తో కుర్రాళ్లను ఒక ఊపు ఊపిన జోడీ ప్రభుదేవా, సిమ్రాన్. వీరిద్దరి కాంబినేషన్‌లో పాటలు వచ్చాయంటే చాలు.. స్టెప్పులతో స్క్రీన్ షేక్ అయిపోయేది. అయితే 1997 తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సరిగ్గా 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. పైగా వీళ్లు కలిసి నటిస్తున్న సినిమాకు పెట్టిన పేరు ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో తెగ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాకు ‘కమల్ శ్రీదేవి’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు మేకర్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ సమర్పణలో జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కృష్ణానంద్ కొట్టారపట్టు ఈ రొమాంటిక్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రభుదేవా, సిమ్రాన్ మళ్లీ కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్‌పై సిమ్రాన్ స్పందిస్తూ.. ఇదొక సరికొత్త, ఎంతో స్పెషల్ జర్నీ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమోకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అలనాటి క్రేజీ డ్యాన్స్ జంట మళ్లీ కలిసి స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
The Moment Is Here! ✨ A Special Combination ❤🔥
We’re excited to bring together @PDdancing × @SimranBaggaOffc With @MithunJS5 and @smehaaofficial joining the cast,for a beautiful new romantic entertainer that promises to capture hearts, with the musical magic of @gvprakash adding a special melody to this beautiful journey!
PRESENTING #KamalSridevi! ❤️✨
Written & Directed by @krishkottar
@Zionfilmsoff @MRP_ENTERTAIN @mageshraj
@sharan_velayudhan @editonraaja @rajeevan69 @Sekar @itsanuvardhan @navaarajkumar @MaheshMathewMMS @camsenthil @prasanth01 #sarathjeevaSamuel @gopiprasanna @valentino_suren @alagiakoothan @RjShivakanth #DineshE #RJSureshKumar @proyuvraaj
— soundarya rajnikanth (@soundaryaarajni) October 25, 2026

