NTV Telugu Site icon

Spirit : డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్..?

Spirit

Spirit

Spirit : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “కల్కి 2898 AD “ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను మేకర్స్ “జూన్ 27 “న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమా తరువాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.అలాగే మారుతీ డైరెక్షన్ లో వస్తున్న”రాజా సాబ్ “సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ప్రభాస్ ,యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Read Also :Chiranjeevi : ‘పరువు’ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలు కానున్నట్లు సమాచారం.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసిన సందీప్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ ను రెండు డిఫరెంట్ లుక్స్ లో చూపించనున్నాడని సమాచారం.మొదటి లుక్ లో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో వైల్డ్ గా చూపించనున్నాడు. మరో లుక్ లో ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా కనిపించనున్నాడని సమాచారం.యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ పాత్రలో ఎన్ని షేడ్స్ చుపించాడో అంతకు ఈ సినిమా వుండనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Show comments