తెలుగు సినిమా పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సంచలనం. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఈ హీరో, ఆ తరువాత కూడా ఆ స్థాయి సినిమాలే చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ అగ్రహారం యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని, మనం చూడని ఒక సరికొత్త తరహా పాత్రగా ఉండబోతోందని సమాచారం ప్రభాస్ అంటేనే యాక్షన్, భారీ సెట్స్, గ్రాండియర్ అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ ఈసారి హను రాఘవపూడి అతడిని ఒక సంప్రదాయ బద్ధమైన, అగ్రహారం నేపథ్యంలో యువకుడిగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఈ పాత్ర కోసం ప్రభాస్ కొత్త బాడీ లాంగ్వేజ్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Saptagiri: సప్తగిరి అత్యుత్సాహం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
హను రాఘవపూడి, ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’, సీతారామం వంటి చిత్రాలతో సున్నితమైన కథలను, పాత్రలు ఆవిష్కరించడంలో తన ప్రతిభను చాటిన దర్శకుడు. ఇప్పుడు ప్రభాస్ లాంటి మాస్ హీరోతో అతడు ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం వస్తోంది. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో పూర్తి మార్పు ఉంటుందని, ఇది అతడి అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజీగా నిలుస్తుందని టాక్. గతంలో ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించినప్పటికీ, ఈ అగ్రహారం యువకుడి పాత్ర అతడి నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించనుంది.ప్రభాస్‌ని ఈ కొత్త అవతారంలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.