Site icon NTV Telugu

Prabhas : ‘ది రాజా సాబ్’ నుండి లేటెస్ట్ అప్ డేట్..

Rajasab

Rajasab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే హార‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందకంటే ప్రభాస్‌ని కామోడి జోనర్ లో చూసి చాలా కాలం అవుతుంది కనుక. ఇక తాజాగా ఈ మూవీ నుండి ఒక అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read : Bhairavam : ‘భైరవం’ నుండి మరో పాట విడుదల..!

ప్రభాస్ వచ్చే వారం నుంచి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాదు ప్రభాస్ అందుబాటులో ఉన్నంత‌సేపు అత‌డికోసం ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారట. ప్రభాస్ మరికొన్ని రోజులు కేటాయిస్తే సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయట. ప్రజంట్ ప్రభాస్ ఉన్న బిజీ షేడ్యూల్‌లో కేవలం ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది.

Exit mobile version