పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల విడుదలైన ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్ 2021’ జాబితాలో ప్రపంచంలోని అందగాళ్ళలో మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో దక్షిణ కొరియా స్టార్ కిమ్ హ్యూన్ జోంగ్ 4వ స్థానంలో, పాకిస్తాన్ హార్ట్‌త్రోబ్ ఫవాద్ ఖాన్ 8వ స్థానంలో ఉన్నారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియా, సౌత్ ఇండియా హీరో కూడా ప్రభాస్ కావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానుల హంగామా మాములుగా లేదు.
Read Also : రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు
“బాహుబలి : ది బిగినింగ్” (2015), “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) చిత్రాలు విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇండియాలో పాన్-ఇండియా చిత్రాల ట్రెండ్ ను స్టార్ట్ చేసిన ఈ సూపర్ స్టార్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన లుక్స్ కు, సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు. ప్రస్తుతం ప్రభాస్ కిట్టిలో ఏకంగా 4 పాన్-ఇండియా చిత్రాలు ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”, నాగ్ అశ్విన్ తో పేరు పెట్టని సైన్స్ ఫిక్షన్, రాధేశ్యామ్ సలార్ చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్నాడు.
