Site icon NTV Telugu

Prabhas : ‘కల్కి 2’ అభిమానులకు శుభవార్త చెప్పిన నిర్మాత..!

Kalki 2

Kalki 2

ప్రస్తుతం ప్రభాస్ లైన‌ప్ ఎంత పెద్దగా ఉందో మనకు తెలిసిందే. ఈ లిస్ట్‌లో ‘క‌ల్కి 2 కూడా ఉంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం కూడా చాలా మంది ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ ప‌నుల‌లో ఉండ‌గా,రీసెంట్‌గా అమితాబ్ బ‌చ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని తెలియ‌జేశారు. ఇక ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభించ‌నున్నట్టు వార్తలు ప్రచారం కాగా ..

Also Read : Ravi Teja : మాస్ రాజా ర‌వితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

ఈ రూమర్స్ పై లేటెస్ట్‌గా సాలిడ్  అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణం పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్, ప్రియాంక దత్‌లు నుంచి క్లారిటీ వచ్చేసింది.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన కొంత షూట్‌ని పూర్తి చేశాం. పార్ట్‌2కి సంబంధించి 35 శాతం షూటింగ్ జ‌రిగింది, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఇక వీటితో పాటుగా దీపికా పదుకొనే పై వస్తున్న రూమర్స్ ని కూడా కొట్టి పారేశారు. ఆమె పార్ట్ 2 లో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు. అంటే మొత్తనికి ‘కల్కి 2’ పై ఒక క్లారిటీ చాలా మందికి వచ్చినట్లే. ఇక ‘కల్కి’ మొదటి సినిమాలో సుమతి (దీపికా పదుకొనే) ని అప‌హరిస్తారు. దీంతో ఆమెను కాపాడటానికి అశ్వత్థామ భైరవ అలియాస్ కర్ణ (ప్రభాస్) బరిలోకి దిగుతారు. తర్వాత ఏంటి అనేది స్టోరీ.

Exit mobile version