Site icon NTV Telugu

Prabhas : ఫేక్ న్యూస్‌తో మోసపోయిన ప్రభాస్ ఫ్యాన్స్..

Spirit

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై అభిమానుల ఉత్సాహం ఎప్పుడూ పీక్స్‌లోనే ఉంటుంది. ఆయన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో చిన్న చిన్న రూమర్స్‌ కూడా పెద్ద వార్తల్లా మారిపోతాయి. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

Also Read : Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్!

సమీప కాలంలో ఓ అనఫీషియల్ X (Twitter) హ్యాండిల్ నుంచి “సెప్టెంబర్ 2న స్పిరిట్ గ్రాండ్ లాంచ్ కానుంది” అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది.. ఆ పోస్ట్ ను చూసిన ప్రభాస్ అభిమానులు ఆనందం తో షేర్ చేసుకుంటూ, నిజంగానే ఆ రోజున అప్డేట్ వస్తుందని నమ్మేశారు. అయితే ఆ పోస్టులో ఎలాంటి నిజం లేదని తేలింది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ ప్రాజెక్ట్‌పై వర్క్‌ అవుట్ జరుగుతున్నప్పటికీ, ఇప్పటి వరకు ఆఫీషియల్‌గా ఎలాంటి లాంచ్ డేట్ ప్రకటించలేదు. దర్శకుడు వంగా సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినా, ఫ్యాన్స్ మధ్య రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

ప్రజంట్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ, ఆయన లైన్‌ప్‌లో స్పిరిట్ కు మాత్రం ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎందుకంటే యానిమల్ సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.

Exit mobile version