Site icon NTV Telugu

Ghaati : స్వీటీ కోసం రంగంలోకి ప్రభాస్.. దేవసేన కోసం ఏంచేసాడంటే?

Ghaati (2)

Ghaati (2)

లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ట్రైలర్ సినిమాపై అంచానాలను పెంచేసాయి.

Also Read : NBK : అఖండ – 2 రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఇక మాస్ విధ్వంసమే

ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందుకోసం రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఘాటీ రిలీజ్ ట్రైలర్ ను సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ చేసాడు ప్రభాస్ ప్రభాస్. రిలీజ్ ట్రైలర్ కూడా సూపర్ గా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా స్వీటీ అనుష్క పర్ఫామెన్స్ వేరే లెవల్ లో ఉంది. కత్తి పట్టి స్వీటీ చేసిన మాస్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా కోసం అనుష్క గట్టిగానే కష్టపడుతోంది. మీడియా ముందుకు రాకున్నా కూడా రానా తో ఫోన్ కాల్ లో ప్రమోషన్స్ తో పాటు ఎక్స్ లో డైరెక్టర్ తో కలిసి ఎక్స్ లో సినిమాకు సంబందించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే అనేక సార్లు రిలీజ్ వాయిదా పడిన ఘాటీ ఎట్టకేలకు రేపు థియేటర్స్ లో రిలిజ్ అవుతోంది. వేదం తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న అనుష్క ఈ సారి తాను అరుంధతి, భాగమతి రేంజ్ హిట్ కొడుతానని ధీమాగా ఉంది. మరి రరిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version