Site icon NTV Telugu

Pawan Kalyan: గాడ్‌ఫాదర్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు

Chiranjeevi, Pawankalyan

Chiranjeevi, Pawankalyan

అగ్ర కథానాయకుడు చిరంజీవి 63వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు వినూత్నంగా చిరు పుట్టినరోజు వేడుకలకు ప్లాన్‌ చేశాసి మోగా అభిమానులు సందడి చేస్తున్నారు. మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి కుటుంసభ్యులు ట్వీటర్‌ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్న నేపథ్యంలో.. అన్నయ్యకు జనసేనాని పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు.

నేను ప్రేమించే, గౌరవించే , ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా దయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. @KChiruTweets. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తిని కోరుకుంటున్నాను అంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు.

స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రోజా తన ట్విటర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ టీజర్, ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం విడుదల అయిన విషయం తెలిసిందే. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్. చివర్లో సల్మాన్ ఖాన్, చిరంజీవి ఒక గోడను బద్దలుకొట్టుకుంటూ కారులో వచ్చే సీక్వెన్స్‌తో ముగుస్తుంది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందకు ‘గాడ్‌ఫాదర్’ను తీసుకురానున్నట్టు వెల్లడించారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
BIhar: సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి.. 13 మంది అరెస్ట్

Exit mobile version