Site icon NTV Telugu

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి అరెస్ట్

Posani Krishna Murali

Posani Krishna Murali

హైదరాబాదులోని గచ్చిబౌలి నివాసంలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. ఇక తర్వాతి పరిణామాల్లో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించారు. ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేశారు. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Officer on Duty: 12 కోట్లతో సినిమా తీస్తే 4 రోజుల్లో 25 కోట్లు

మరోవైపు ఇప్పటికే పలుచోట్ల పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులను ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి కించపరిచేలా మాట్లాడారంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇక తాజాగా రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా తాను పోలీసులతో రాలేనని చెప్పినా వినకుండా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీ తరలిస్తున్నారని సమాచారం.

Exit mobile version