Site icon NTV Telugu

Lasya was admitted to the hospital: యాంకర్‌ లాస్యకు ఏమైంది? ఆసుపత్రిలో.. ఏంటి ఇలా!

Lasya Was Admitted To The Hospital

Lasya Was Admitted To The Hospital

Popular anchor Lasya was admitted to the hospital with high fever: ప్రముఖ యాంకర్‌ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్‌. ఆమె యాంకర్‌ గా స్టేజీపై చేసే సందడి అంతా ఇంతాకాదు. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్‌ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే.. తాజాగా లాస్య హాస్పిటల్‌ పాలైంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడమే కాకుండా సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇక లాస్య సోషల్ మీడియా వేడికగా తన కుమారుడు జున్ను గురించి ఎన్నో వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా నిత్యం ఎంతో చలాకీగా ఉండే లాస్య ప్రస్తుతం హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయినట్లు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. హాస్పిటల్‌ బెడ్‌ పై ఉన్నటువంటి ఈమె తన భర్త మంజునాథ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. గెట్ వెల్‌ సూన్‌ అంటూ పోస్ట్‌ పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఈ క్రమమంలోనే ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్‌ అవ్వడమే కాకుండా అసలు లాస్యకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

లాస్య హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయినట్టు భర్త మంజునాథ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఫోటోలు షేర్‌ చేసినప్పటికి ఏ కారణం చేత ఆమె అడ్మిట్‌ అయ్యారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం లాస్య గత కొన్ని రోజులకు వైరల్ ఫీవర్‌ తో ఇబ్బంది పడుతుందని అయితే ఈ ఫీవర్‌ కారణంగానే లాస్య ఎంతో నీరసించి పోవడంతోనే తన భర్త తనని హాస్పిటల్లో చేర్పించారని తెలుస్తోంది. ఈమె ఆస్పత్రి పాలవడానికి సరైన కారణం తెలియక పోయినప్పటికి ఈమె తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.
Bigg Boss 6: ఈసారి హౌస్ లో రెండు జంటలు!

Exit mobile version