NTV Telugu Site icon

Poonam Kaur: నంబి నారాయణ్ కి చేనేత వస్త్రాల బహూకరణ

Poonam Nambi

Poonam Nambi

Poonam Kaur met Nambi Narayanan presented him handlooms: తెలుగులో కొన్ని సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూనం కౌర్. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ అనలేం కానీ అంతకు మించి వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. పూనమ్ కౌర్ మూవీస్ లో నటించకపోయినా కానీ ఏపీ రాజకీయాలతో ఆమెకు మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఏపీ విడిపోయిన అనంతరం ఆమెను మొదటి దఫా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించారు. అప్పటి నుంచి ఆమె చేనేత కోసం చాలా కష్టపడుతోంది. ఐతే రీసెంట్ గా జాతీయ చేనేత దినోత్సవాన్ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న పూనం చేనేత వస్త్రాలను ధరించి తనదైన డ్రెస్సింగ్ స్టైల్ లో డిఫరెంట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఐతే ఆమె రీసెంట్ గా ఈ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ ని కలిశారు. ఆయన కోసం కొన్ని చేనేత వస్త్రాలను తీసుకు వెళ్లిన ఆమె ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏపీ నుండి ప్రత్యేక చేనేత వస్త్రాలు ఆయన కోసం తీసుకెళ్ళాను. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని, ఒక గంట పాటు ఎన్నో విషయాలు మాట్లాడారు అని అన్నారు. చిన్నతనంలో, మహాభారతం, రామాయణం వంటి పురాణ ఇతిహాసాల్లో చెడుపై మంచి విజయం ఎలా సాధించిందో వంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నా, నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఇంచుమించు అలాగే ఉంటుంది ఆమె అన్నారు. ఈ లివింగ్ లెజెండ్‌ను కలుసుకోవడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనన్న ఆమె కష్ట సమయాల్లో, ఎలా మన మాటకు, మన నడతకు కట్టుబడి ఉండాలో ఆయన్ని చూస్తే అర్ధమవుతుందన్నారు. ఇక ఆయన షేర్ చేసుకున్న ఎన్నో విషయాలు కూడా ఉన్నాయని ఆయన ఈ దేశానికి హీరో… నిజమైన దేశభక్తుడు” అంటూ పూనం కౌర్ రాసుకొచ్చింది.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, ఆమె నంబి నారాయణన్ ని కలుసుకుని, నైపుణ్యం కలిగిన చేనేత కార్మికుడు సత్యనారాయణ రూపొందించిన చేనేత వస్త్రాలు, జాతీయ జెండాను బహుకరించారు. పూనమ్ చేసిన సామాజిక ప్రయత్నాలకు నంబీజీ ఎంతో ముగ్ధుడై, ఆమె కథ ప్రధానమంత్రికి చేరుతుందని ఆమెకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా, సత్యనారాయణ జెండా గతంలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు అధ్యక్షురాలు ముర్ముకి సమర్పించబడింది. అనంతరం నంబి జీ పూనమ్‌పై ప్రశంసలు కురిపించారు, ఆమె అంకితభావానికి ఆమెను ఆశీర్వదించారు. ఆమె భవిష్యత్తు ప్రయత్నాలలో గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నేత కార్మికుడు సత్యనారాయణ నేసిన లుంగీ కట్టి, చీరను తన భార్యకు కట్టి, ఆయన పేరు మీద జెండాను ఎగురవేస్తానని హామీ ఇచ్చారు.