Poonam Kaur: నేను ఇబ్బంది పడ్డా.. పోసాని ఆరోగ్యం గురించి దిగులుగా ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు, గత ప్రభుత్వ హయాంలో వైసిపికి మద్దతుగా అందించిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓబులవారిపల్లె అనే ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయనని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే తాజగా ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా పోలీసులు ఆయనను ముందుగా రాజంపేట ఆసుపత్రికి తర్వాత కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ అంశం మీద సినీనటి పూనం కౌర్ స్పందించారు.
Tollywood : తెలుగు స్టార్ హీరోపై నెగటివ్ పీఆర్ ఆరోపణలు?
Also Read
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సిట్యుయేషన్స్ చాలా దరిద్రంగా మారుతున్నాయని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. బలహీనులైన వారిని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళడం కచ్చితంగా పగ తీర్చుకోవడమే అని ఆమె చెప్పుకొచ్చారు. నేను వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పడ్డా కానీ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం గురించి నాకు దిగులుగా ఉంది. ఆయనను మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ పూనం కౌర్ కామెంట్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో పూనం కౌర్ పేరు ప్రస్తావిస్తూ పోసాని కృష్ణ మురళి పలు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆయన మాటల వల్ల తాను గతంలో ఇబ్బందిపడినా సరే ఆయన ఆరోగ్యం గురించి తాను బాధపడుతున్నట్లుగా పూనం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!