సినీ నటుడు, గత ప్రభుత్వ హయాంలో వైసిపికి మద్దతుగా అందించిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓబులవారిపల్లె అనే ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయనని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే తాజగా ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా పోలీసులు ఆయనను ముందుగా రాజంపేట ఆసుపత్రికి తర్వాత కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ అంశం మీద సినీనటి పూనం కౌర్ స్పందించారు.
Tollywood : తెలుగు స్టార్ హీరోపై నెగటివ్ పీఆర్ ఆరోపణలు?
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సిట్యుయేషన్స్ చాలా దరిద్రంగా మారుతున్నాయని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. బలహీనులైన వారిని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళడం కచ్చితంగా పగ తీర్చుకోవడమే అని ఆమె చెప్పుకొచ్చారు. నేను వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పడ్డా కానీ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం గురించి నాకు దిగులుగా ఉంది. ఆయనను మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ పూనం కౌర్ కామెంట్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో పూనం కౌర్ పేరు ప్రస్తావిస్తూ పోసాని కృష్ణ మురళి పలు సంచలన ఆరోపణలు గుర్తించారు. ఆయన మాటల వల్ల తాను గతంలో ఇబ్బందిపడినా సరే ఆయన ఆరోగ్యం గురించి తాను బాధపడుతున్నట్లుగా పూనం చెప్పుకొచ్చారు