Site icon NTV Telugu

Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!

Samantha Poonam Kaur

Samantha Poonam Kaur

Poonam Kaur Comments on Samantha Health Tip Controversy: సమంత రూత్ ప్రభు కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై పోస్ట్ చేసింది. దీనిపై డాక్టర్ ఫిలిప్స్ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ సమంతను మందలిస్తూ, దీని వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిరూపించాడు. తాను చిత్తశుద్ధితో ఈ సలహా ఇచ్చానని, తనకు ఈ విషయం చెప్పిన డాక్టర్ వైద్య నిపుణులు, 25 ఏళ్లుగా DRDOలో ఉన్నారని సమంత రిప్లై పోస్ట్ చేసింది. సమంతను నిరక్షరాస్యురాలిగా అభివర్ణిస్తూ డాక్టర్ ఫిలిప్స్ ఆమెను జైలుకు పంపాలని సూచించగా, ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తమిళ సినీ నటుడు విష్ణు విశాల్ భార్య జ్వాలా గుత్తా కూడా సమంతను టార్గెట్ చేసింది.

Khushbu: “నా పెళ్లిలో ఆ హీరో గుక్కపెట్టి ఏడ్చాడు..” 24 ఏళ్ల తర్వాత నిజాన్ని బయటపెట్టిన ఖుష్బూ!

సమంత సూచించిన ట్రీట్‌మెంట్ పద్దతి వల్ల ప్రాణాంతకమైన ఫలితానికి బాధ్యత వహిస్తారా అని జ్వాలా గుత్తా ప్రశ్నించారు. మీకు సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను, కానీ మీకు తెలిసినట్లుగా, రెసిపీ పని చేయకపోతే దానికి ఏదైనా ప్రాణాంతకమైన ఫలితం వస్తే మీరు బాధ్యత తీసుకుంటారా? మీరు ట్యాగ్ చేసిన డాక్టర్ కూడా బాధ్యత వహిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. అయితే దీనికి హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనే దానికి ఉదాహరణ. చాలా మంది ప్రముఖులు చక్కెర తీసుకోరు, కానీ వారు తీసుకోని చక్కెర ఉన్న పానీయాలు మరియు చాక్లెట్ల గురించి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా డార్క్ రియాలిటీ అని పూనమ్ కౌర్ కామెంట్ చేశారు.

Exit mobile version