Site icon NTV Telugu

Trivikram: జీవితాలను నాశనం చేసేవాడు.. త్రివిక్రమ్ మీద విరుచుకుపడ్డ పూనమ్

Trivikram Poonam

Trivikram Poonam

Poonam Kaur Again Made Sensational Allegations on Trivikram: ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్న పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో మాట్లాడే ఒక రేప్ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ డైలాగ్ రాసిన త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అని అర్థం వచ్చేలా పూనం కౌర్ కామెంట్ చేసింది. అయితే ఈ క్రమంలో విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ దయచేసి మీ పర్సనల్ కోపాలు ఏమైనా ఉంటే వాటిని సోషల్ మీడియాలో చూపించొద్దు.

Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?

త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసు అంటూ ఆమెకు కామెంట్ చేశాడు. దానికి స్పందించిన పూనం కౌర్ నాకు అతని చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఇగో గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో మాట్లాడుతుంటే నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. అతను జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ పూనం కౌర్ త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి త్రివిక్రమ్ గురించి పూనం కవర్ ఇలా బహిరంగంగా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. చాలా కాలం నుంచి ఆమె కొన్నిసార్లు ప్రత్యక్షంగా మరికొన్నిసార్లు పరోక్షంగా త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా ఆమె త్రివిక్రమ్ టార్గెట్ చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Exit mobile version