Site icon NTV Telugu

Pooja Hegde : దాని కోసం ఎక్స్‌ట్రా వర్కౌట్లు చేయకతప్పదు..

Pooja Hegde

Pooja Hegde

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన హీరోయిన్ లో పూజాహెగ్డే ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు, తన కంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. వరుస డిజాస్టర్స్ లు అందుకున్న పూజ తెలుగు ఇండస్ట్రీకి మొత్తమే దూరం అయ్యింది. తమిళ, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినప్పటికి అక్కడ కూడా ఫ్లాప్‌లే ఎదురుకుంది. రీసెంట్‌గా ‘రెట్రో’ మూవీతో వచ్చినప్పటికి ఇది కూడా పూజా హెగ్డేకి హిట్టుని తెచ్చిపెట్టలేకపోయింది. కాగా ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆమె చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. ఇందులో ‘జన నాయగన్’ కనుక హిట్ అయితే పూజ కెరీర్ కు మంచి కం బ్యాక్ అవుతుంది. అయితే కెరీర్‌లో ఎంత బీజీగా ఉన్నప్పటికి కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది పూజ.

Also Read : Renu Desai : చైనా పై రేణు దేశాయ్ హాట్ కామెంట్స్.. ?

మనకు తెలిసి అవకాశాలు ఉన్నప్పటికి లేనప్పటికి హీరోయిన్‌లు వర్కౌట్, డైటింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. పూజా హెగ్డే కూడా అంతే తనకు అవకాశాలు వచ్చినా, రాకపోయినా కూడా ఫిట్ నెస్ మీద పూర్తిగా ఫోకస్‌తో ఉంటుంది. ఇక తాజాగా ఏమైనా జంక్ ఫుడ్ తింటే ఎక్స్ ట్రా వర్కౌట్లు చేయాల్సిందే అన్నట్టుగా చెబుతోంది. బ్రెడ్, నూడుల్స్ వంటివి తింటే.. ఇలా ఎక్స్ ట్రా వర్కౌట్లు తప్పవు అంటూ పూజా హెగ్డే తన స్టోరీ లో పోస్ట్ చేసింది. కాగా ఈ పోస్ట్‌లో వర్కౌట్లు చేసి పూజా హెగ్డే అలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.

Exit mobile version