NTV Telugu Site icon

Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..

Poja Hegde (2)

Poja Hegde (2)

ఒక్కప్పుడు డబ్బింగ్ అర్టిస్ట్‌లకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్ హీరోలకు.. చాలా వరకు వారి వాయిస్ వారికి సూట్ అవ్వదు. అందుకే వాలకి సెపరేట్‌గా డబ్బింగ్ ఆర్టిస్టుల ఉంటారు. కానీ ప్రజంట్ ఇప్పుడు ఉన్న హీరోయిన్‌లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు, అభిమానులకు మరింత చేరువకావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్‌ డబ్బింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్‌, సాయిపల్లవి వంటి అగ్రతారలు డబ్బింగ్‌ కోసం సొంతంగా వాయిస్ అందిస్తున్నారు.

Alsio Read: Kalyanram : అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇప్పుడు వీరి వరుసలో పూజా హెగ్డే చేరింది. ఈ భామ తమిళంలో సూర్య సరసన ‘రెట్రో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే నెలలో విడుదలకానుంది. అయితే ఈ మువీ కోసం పూజాహెగ్డే తమిళంలో సొంతంగా డబ్బింగ్‌ చెప్పిందట.. అలాగే ‘నా కెరీర్‌ తొలిసారి సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం ఆనందంగా ఉంది, ఇక ముందు అన్ని భాషల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతాను. తెలుగు సినిమాల్లో కూడా ఓన్‌ డబ్బింగ్‌ చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తను’ అని తెలిపింది పూజ. ఇక గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫోకస్ మొత్తం తమిళ ఇండస్ట్రీ పై పెట్టింది. సూర్య ‘రెట్రో’తో పాటుగా, దళపతి విజయ్‌ ‘జన నాయగన్‌’, రాఘవ లారెన్స్‌ ‘కాంచన-4’ వంటి వరుస చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలు దక్షిణాదిన తనకు పూర్వ వైభవం తెచ్చిపెడతాయా లేదో చూడాలి.