Site icon NTV Telugu

Pooja Hegde : పూజా పాప రియాలిటీకి దగ్గరైందే

Pooja Hegde

Pooja Hegde

ఒక్కపుడు నటీనటులకు, అభిమానులకు ప్రింట్ మీడియా ప్రధాన వారధిలా నిలిచేది. అంతే తప్ప వారిని కలవడం, చూడటం, మాట్లాడటం, అనేది చాలా కష్టమైన పని. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరో హీరోయిన్‌ల అభిమానుల మధ్య హద్దులు చెరిగిపోయాయి. స్టార్స్ తమకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు చేరవేస్తున్నారు. దీంతో ఎక్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో మన సౌత్ హీరోలకు, హీరోయిన్‌లకు కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈ ఫాలోవర్స్ పై స్టార్ హీరోయిన్ పూజ హెగ్డె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..

Also Read: Kamal Haasan : ‘థగ్ లైఫ్’ నుంచి ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ డెట్ ఫిక్స్..

ప్రజంట్ పూజ కెరీర్ కాస్త గట్టెక్కింది.. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇందులో సూర్య హీరోగా నటిస్తున్న ‘రెట్రో’ మూవీ ఇకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సోషల్‌మీడియా గురించి పూజాహెగ్డే ఆసక్తికరమైన కామెంట్స్‌ చేసింది.. ‘ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అంతమాత్రాన వారందరూ టికెట్లు కొని నా సినిమాలు చూస్తారని గ్యారంటీ ఇవ్వలేం కదా.. సోషల్‌మీడియా చాలా భిన్నమైన ప్రపంచం. ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ధారణ చేసుకోలేం. కొంతమంది తారలకు 50లక్షల మంది ఫాలోవర్స్‌ మాత్రమే ఉంటారు. కానీ బాక్సాఫీస్‌ వద్ద వాళ్ల సినిమాలకు మంచి వసూళ్లు లభిస్తాయి. అందుకే వృత్తి పట్ల అంకితభావంతో ఉంటూ, బయట వారి నుంచి సినిమాకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి’ అని పూజా హెగ్డే తెలిపింది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్‌గా మారాయి.

Exit mobile version