Kamal Haasan : ‘థగ్ లైఫ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డెట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి ‘థగ్ లైఫ్’ కోసం పని చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జి యాంట్ మూవీస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కు ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్..
ఏంటీ అంటే.. ‘థగ్ లైఫ్’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘జింగుచా’ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీతో మణిరత్నం, ఏ ఆర్ రెహమాన్ కాంబో పై మరోసారి భారీ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే వీరిద్దరి కలయికలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అందుకే ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
One BEAT
Two THUGS#ThugLife brings the real anthemA #ManiRatnam Film
An @arrahman Musical
Thuglife first single #Jinguchaa releasing on April 18 #JinguchaaApril18 #Jinguchaafirstsingle #ThuglifeFromJune5 #KamalHaasan… pic.twitter.com/IObQ36ZfRU
— Raaj Kamal Films International (@RKFI) April 16, 2025
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!