Site icon NTV Telugu

బ్లేజర్‌ బటన్స్ విప్పేసి పూజాహెగ్డే రచ్చ..!

Pooja Hegde Monochrome Pic Goes Viral

పూజా హెగ్డే తెలుగు చిత్రసీమలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ డాల్స్‌లో ఒకరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి పెద్ద ప్రాజెక్ట్‌లోనూ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా పూజా తన గ్లామర్ స్నాప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక హాట్ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో పూజా టాప్ లేకుండా కేవలం బ్లాక్ కలర్ బ్లేజర్‌ను ధరించింది. కానీ దానికి బటన్స్ పెట్టలేదు. దానికి జతగా డెనిమ్ షార్ట్ ధరించింది. బ్లేజర్‌ బటన్స్ విప్పేసి పూజాహెగ్డే దిగిన ఈ పిక్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ మోనోక్రోమ్ పిక్ లో ఆమె అందం మరింతగా పెరిగిందా అన్పిస్తోంది.

Read Also : తెలుగు తేజం పీవీ సింధుకు టాలీవుడ్ అభినందనలు

ప్రస్తుతం పూజా హెగ్డే “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఇటీవలే తలపతి విజయ్ “బీస్ట్” సెట్‌లో చేరింది.

Exit mobile version