Site icon NTV Telugu

Pooja Hegde : నాని తో వర్క్ చేయాలని ఉంది..

Nani Pooja Hede

Nani Pooja Hede

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘రెట్రో’ సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లోనే కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఆమె లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌గా సూర్య కనిపించకున్నప్పటికి లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుందట. ఇక సమ్మర్ స్పెషల్‌గా మే 1న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గోంటుంది పూజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేచురల్ స్టార్ నాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..

Also Read: Coolie : సూపర్ స్టార్ మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన శ్రుతి హాసన్

టాలీవుడ్‍లో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారని ప్రశ్నకు.. పూజా ‘నానితో కలిసి ఏదో ఒక రోజు పని చేయాలని ఉంది. ఎందుకంటే నాని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చిత్రాల్లో నాకు ‘నిన్ను కోరి’ సినిమా చాలా ఇష్టం. ఆ మూవీలో నాని యాక్టింగ్ చాలా బాగుంటుంది.. తన ప్రతి ఒక మూవీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. తనతో వర్క్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది విన్న’ అంటూ చెప్పుకొచ్చింది అలాగే తాను ఓ తెలుగు చిత్రానికి ఓకే చెప్పానని పూజా తెలిపింది. కానీ ఆ ప్రాజెక్టు గురించి వివరాలు చెప్పలేదు.

Exit mobile version