NTV Telugu Site icon

Pongal 2024 : పొంగల్ రేసు నుండి తప్పుకున్న స్టార్ హీరో

Veeradheera

Veeradheera

పొంగల్ రేసు నుండి ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. గేమ్ ఛేంజర్, విదాముయర్చి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో పండుగ సీజన్ పిచ్చ కాంపిటీషన్‌గా మారిపోయింది. సెల్ఫ్ డామినేషన్ ఎందుకులే అని గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ దంగల్ నుండి తప్పుకుంది. ఇదే కాదు మరో స్టార్ హీరో కూడా చెర్రీకి, అజిత్‌కు సైడిచ్చాడు. కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్‌తో చేసిన ధ్రువ నక్షత్రం షూటింగ్ కంప్లీటైనా  విడుదలకు నోచుకోవడం లేదు.

also read : Allari Naresh : వరల్డ్ వైడ్ బచ్చల మల్లి డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు ఇవే

యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎస్‌‌యు అరుణ్ కుమార్‌తో విక్రమ్ వీర ధీర సూరన్-2 చేస్తున్నాడు విక్రమ్ వీర ధీర సూరన్-2ని ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఎప్పటి నుండో కర్చీఫ్ వేసుకున్న గేమ్ ఛేంజర్, బాల డైరెక్షన్‌లో వస్తోన్న‌వనంగాన్, సడన్‌గా స్లాట్ బుక్ చేసుకున్న అజిత్ విదాముయర్చి పొంగల్ రేసులోకి వచ్చేయడంతో విక్రమ్ సైడయ్యాడు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వస్తోన్న వీర ధీర శూరన్‌లో దుషారా విజయన్ హీరోయిన్. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సూరజ్ వెంజరమూడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తోన్న ఈ మూవీ పొంగల్ దంగల్ నుండి తప్పుకుని  జనవరి 24న వచ్చేందుకు ఫిక్సైంది.  రిపబ్లిక్ డే కానుకగా వీర ధీర శూరన్‌తో రావాలనుకుంటున్నాడట విక్రమ్. మరీ ఏడాది తంగలాన్‌తో దెబ్బ తిన్న చియాన్‌కు డైరెక్టర్ అరుణ్ కుమార్ హిట్టిస్తాడో లేదో రానున్న రోజులో తెలుస్తుంది.

Show comments