Drugs Case: సినీ ప్రముఖులకు డ్రగ్స్ అమ్మిన హీరో ప్రియురాలు?

Drugs

Drugs

Police Seeks Custody of Actress Lavanya who is alleged lover of a tollywood hero: హైదరాబాద్‌ శివారు నార్సింగ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పట్టుబడ్డ లావణ్య అనే యువతి విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి షార్ట్‌ ఫిలింస్, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించిందని తేలింది. ఇక ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్‌ హీరోకు పరిచయమై ఇద్దరూ ప్రేమలో పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులోఅనుమానితురాలిగా ఉండగా సినీ పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు లావణ్య సోషల్‌ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్‌ పరిశీలిస్తున్న పోలీసులు సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు.

Hanuman: హనుమాన్ సినిమా చూస్తూ ఓ మహిళ వింత ప్రవర్తన.. వీడియో వైరల్..

లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్న పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ వేయగా ఈ విచారణలో పలు విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ అమ్మినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఒక్క గ్రాము రూ.6వేలకు అమ్ముతున్నట్లు తేల్చారు. కొన్నాళ్ల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో లావణ్య పేరు కూడా ఉండగా అప్పుడు దొరక్కుండా తప్పించుకోవడంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకుని చెక్ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయి.