NTV Telugu Site icon

Bigg Boss 8 Telugu: పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్!

Bigg Boss 8

Bigg Boss 8

సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్‌ సీజన్‌ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్‌, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు టాప్ 5లో నిలిచారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య విన్నింగ్ రేస్‌ ఉండగా నిఖిల్ విజేతగా నిలవగా గౌతమ్‌ రన్నరప్‌గా నిలిచాడు. విజేత నిఖిల్‌ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూరు కాగా గోరింటాకు సీరియల్ ద్వారా పార్థుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక హీరో రాంచరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్‌కు రూ.55 లక్షల చెక్కు అందజేశారు.

Allu Arjun: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ పోస్ట్

గత సీజన్లో పల్లవి ప్రశాంత్ గెలిచిన సమయంలో హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పెద్ద దుమారమే రేగింది. అనేక మంది యువకులు ర్యాలీ చేసేందుకు రావడంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కప్ అందుకున్న కొద్ది గంటలకే పల్లవి ప్రశాంత్ అరెస్టు కూడా అయ్యాడు. అయితే ఆ అనుభవంతో నిన్న 300 మంది పోలీసులతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లే అన్ని దారులను బారీకేడ్లతో మూసేసి పోలీసులు రంగంలోకి దిగారు. ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా ఎలాంటి ర్యాలీ లేకుండా సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయాడు విన్నర్ నిఖిల్. అలా మొత్తం మీద పోలీసుల చొరవతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్ హ్యాపీస్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Show comments