Police Interrogating RGV: వివాదాస్పద పోస్టులతో కేసులు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్‌బాబు నేతృత్వంలోని టీమ్.. ఆర్జీవిని ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు ఆరు గంటలుగా ఆర్జీవీ విచారణ కొనసాగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే ఆ పోస్టింగ్స్ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు ఆర్జీవీ.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ పోస్టింగ్స్ చేసినట్టు ఆర్జీవీ అంగీకరించారట.. కానీ, ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారట..
Read Also: AP Budget Session: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ.. తర్వాతే బడ్జెట్ సమావేశాలు..
మరోవైపు, ఫైబర్ నెట్ నుండి రెండు కోట్ల రూపాయలు ఆర్జీవీకి కేటాయించడంపై ప్రశ్నలు సంధించారట పోలీసులు.. కానీ, రెండు కోట్ల కేటాయింపు పై రాంగోపాల్ వర్మ ఎలాంటి సమాధానం చెప్పనట్టుగా తెలుస్తోంది.. ఇక, వైసీపీ నేతలతో ఆర్జీవీకి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీయగా.. వైసీపీ నాయకులతో తనకు వ్యక్తి గత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవీ సమాధానం ఇచ్చారట.. అయితే, మరో నాలుగైదు గంటల పాటు ఆర్జీవీ విచారణ కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, పోలీసుల విచారణకి వచ్చే ముందుగా వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. ఆర్జీవీని కలవడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారట..