Site icon NTV Telugu

శ్రీకాంత్ విడుదల చేసిన ‘పాయిజన్’ మూవీ మ్యాడ్ సాంగ్!

రమణ హీరోగా రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక నిర్మిస్తున్న సినిమా ‘పాయిజన్’. సిఎల్ఎన్ మీడియా బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు డి. జె. నిహాల్ స్వరపరిచిన మ్యాడ్ సాంగ్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పాయిజన్’ మూవీలోని మ్యాడ్ సాంగ్ ట్రెండీగా బాగుంది. పిక్చరైజేషన్ సైతం యూత్ ఫుల్ గా ఉంది. ఈ చిత్ర కథానాయకుడు రమణ నాకు తమ్ముడికన్నా ఎక్కువ. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ లోని డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేశామని దర్శకుడు రవిచంద్రన్ చెప్పారు. ఈ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ జర్మన్ నుండి ఎబూల్టన్ మ్యూజిక్ ను ఇంపోర్ట్ చేసుకున్నారని హీరో రమణ చెప్పారు.

Exit mobile version