NTV Telugu Site icon

People Media Factory: “సాలా” సినిమాకు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో

Untitled Design (30)

Untitled Design (30)

హిట్టు ఫ్లాప్స్ తోసంబంధం లేకుండా విభిన్న చిత్రాలు నిర్మించి సౌత్ సినిమా స్థాయిని పెంచాలని భావిస్తోంది పీపుల్స్ మీడియా. ఒక పక్క తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే తమిళంలో కూడా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తుంది. రెబల్ స్టార్ తో ది రాజా సాబ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలో ఓ సినిమాను నిర్మించింది. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ “సాలా”. ఈ గురువారం హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మీట్ అయ్యారు.

Also Read: Balayya: సత్తా చాటిన బాలయ్య భగవంత్ కేసరి.. మ్యాటర్ ఏంటంటే..?

ఈ సందర్భంగా సాలా సినిమాకు తన బెస్ట్ విశెస్ అందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు టీజీ విశ్వప్రసాద్ కు సాలా సినిమా కోలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. విశ్వప్రసాద్ ఇలాగే అన్ స్టాపబుల్ గా సినిమాలు నిర్మించాలని ఆకాంక్షించారు ఐకాన్ స్టార్. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు. ధీరన్, రేష్మ వెంకటేష్, చార్లెస్ వినోద్, శ్రీనాథ్, అరుల్ దాస్, సంపత్ రామ్, అల్ అజీనా, అతులథ్, తదితరులు నటించిన ఈ చిత్రం నేడు తమిళ్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుంది.

Show comments