Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం

Adhika Masa Purnima (6)

Adhika Masa Purnima (6)

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లతో హోరెత్తిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తున్న వేళ, డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు పెద్ది సినిమాకు ట్రైలర్ అవసరం లేదంటూ ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ట్రైలర్లు చూసే సినిమాలకు వెళ్తున్నామా ఏంటి..
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు అధికారిక ట్రైలర్ రాకపోవడంపై ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బుచ్చిబాబు తనదైన శైలిలో స్పందించారు. “ఇంత బజ్ ఉన్న ‘పెద్ది’ సినిమాకి రిలీజ్ ట్రైలర్ అక్కర్లేదు.. అసలు ఈ సినిమాకి ట్రైలర్ కూడా అక్కర్లేదు. ఒకప్పుడు మనం అన్ని సినిమాలకీ ట్రైలర్లు చూసే థియేటర్లకు వెళ్లే వాళ్లమా ఏంటి? కథపై, కంటెంట్‌పై మాకు అంత నమ్మకం ఉంది” అని బుచ్చిబాబు కుండబద్దలు కొట్టారు. సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ దృష్ట్యా కేవలం ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

×
×
Ad

సోషల్ మీడియాకు గుడ్ బై..
సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లపైనే పూర్తి దృష్టి పెట్టడం కోసం బుచ్చిబాబు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. “నేను ప్రస్తుతం సోషల్ మీడియాలో లేను. నా ఫోన్ లో ఉన్న అన్ని సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసేసాను” అని బుచ్చిబాబు షాకింగ్ నిజం చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ లేదా అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటూ, కేవలం థియేటర్లలో ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ట్రైలర్ లేకుండానే సినిమాను థియేటర్లలోకి తెస్తున్నారంటే ‘పెద్ది’ అవుట్‌పుట్ ఏ రేంజ్‌లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి ట్రైలర్ లేకుండానే జూన్ 4న బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.