Peddi : ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ పై లెటేస్ట్ బజ్ ..

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి విశేషమైన స్పందన లభించగా, మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..

Also Read : Deepika Padukone : దీపికా కు మరో అరుదైన గౌరవం..

ఇప్పటికే మేకర్స్ సినిమా విడుదల తేదీని 2025 మార్చి 27 గా అధికారికంగా ప్రకటించగా.  తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ ఈ వార్త పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బజ్ చుట్టూ భారీ ఎగ్జైట్‌మెంట్ నెలకొంది.