అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ నిర్మిస్తున్న సినిమా ‘పీనట్ డైమండ్’. దీనికి వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకి బెంగాల్ టైగర్
ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పాటను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఆ పాట కూడా విశేష ఆదరణ లభించిందని, టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేశారని నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి జె. ప్రభాకర రెడ్డి కెమెరామేన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ‘పీనట్ డైమండ్’ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉందని, ట్రైలర్ కూడా బాగుందని, దర్శకుడు విజువల్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారని, సినిమా హిట్ అయి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని అంటున్నారు క్రిష్.